22-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 21 : యువ బ్యా డ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో మల్లంపేట-బాచుపల్లి స్పోర్ట్స్ బ్యా డ్మింటన్ అకాడమీలో తెలంగాణ ఓపెన్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ యువిఎన్ బా బు, ట్రెజరర్ వంశీధర్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడా వసతుల కల్పన, అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తామని యువిఎన్ బాబు చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో యువ క్రీ డాకారుల కోసం మెరుగైన శిక్షణ, సౌకర్యాలు కల్పించేందుకు అసోసియేషన్ కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పో టీలు నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు నిలబెట్టేలా కృషి చేస్తామన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నీలు దోహదపడతా యన్నారు.
పోటీలు నిర్వహిస్తున్న అకాడమీ చీఫ్ కోచ్ కట్టోజి వెంకట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ మీ డియా కోఆర్డినేటర్ వెంటకరమణారెడ్డి, మల్కాజగిరి మేడ్చ ల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి వికాస్ హర్ష పాల్గొన్నారు.