calender_icon.png 18 December, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

17-12-2025 01:29:50 AM

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

ఇబ్రహీంపట్నం,డిసెంబర్ 16 : మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, చిన్న పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంచాల్ మండలమునకు సంబంధించి మంచాలలోని ధన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.

చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటిరియల్ క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సరిగా ఉన్నాయని నిర్దారణ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి బయలుదేరాలని సూచించారు.  ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి, సంబంధిత తహసీల్దార్లు, ఎంపిడిఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.