22-07-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి జులై 21 (విజయ క్రాంతి): చేనేత కార్మికులు, కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నకు అభయ హస్తం పథకం పై నేడు చౌటుప్పల్ పట్టణంలోని పద్మ వంశీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే అవగాహన సదస్సు చేనేత కార్మికులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా చేనేత జోలి శాఖ సహాయ సంచాలకు కోరారు. ఈ పథకంలో తెలంగాణ నేతన్న భరోసా, తెలంగాణ నేతన్న భద్రత, తెలంగాణ నేతన్న పొదుపు పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య విచ్చేస్తున్నారని తెలిపారు.