calender_icon.png 23 July, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ఠాణాలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

22-07-2025 12:00:00 AM

అధికారుల టేబుల్ పై కూర్చొని మీడియాతో మాటామంతీ

నిజామాబాద్ జులై 21: (విజయ క్రాంతి): అధికారం మనదైతే అడిగేవాడు ఎవరూ... అన్న చందనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్మూర్ డివిజన్లోని  పోలీస్ స్టేషన్లో జరిగిన  సంఘటన ఆలస్యంలో గా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ మధ్య జరిగిన పరస్పర దాడుల విషయనికి సంబంధించి కాంగ్రెస్ చోట మోటా నాయకులు ఏకంగా పోలీస్ ఠణ లో పోలీసు అధికారి కూర్చుండే టెబుల్ పై కూర్చొని లోపల సమావేశం నిర్వహించారు. పోలీస్ కార్యాలయం కాస్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారింది.

నిజామాబాద్ జిల్లాలోని  ఆర్మూర్ డివిజన్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి కూర్చుండే టేబుల్ పై నే కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించాడం. తో ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులకు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది జీ హుజూర్ అంటూ సఫారియలు చేయడం. ఈ పోలీస్ ఠణ తోపాటు జిల్లా పోలీసులకు తలవంపులను తెచ్చింది.

ఈ విషయమై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాల్కొండ నియోజక వర్గం కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన నాయకులు ఆర్మూర్ డివిజన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల  సమావేశం నిర్వహించడం ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రెస్ మీట్ నిర్వహణకు ఆర్మూర్ పోలీసులే దగ్గరుండి ఏర్పాటు చేసినట్టు . తెలుస్తోంది.

బాల్కొండ నియోజకవర్గంలో గతంలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య ఏర్పడిన వివాదంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి ఆర్మూర్ ఓల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు బైండోవర్ చేసిన కాంగ్రెస్ నాయకులకు రాచ మర్యాదలు చేసిన పోలీసులు ప్రెస్ మీట్ ను కూడా తమ పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేయడం  ఆర్మూర్ పోలీసులు ఏ మేరకు రాజకీయ ఒత్తిడితో పని చేస్తున్నారనే దానికి అద్దం పడుతోంది.

ప్రెస్ మీట్ నిర్వహించిన టేబుల్ పై పోలీసుల టోపీలు ఫైళ్లు కూడా ఉన్నాయి. పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్ర  తీవ్ర విమర్శలను పోలీస్ శాఖ ఎదుర్కొంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాచమర్యాదలు చేసిన పోలీసులపై శాఖాపర్యమైన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.