calender_icon.png 8 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి

08-09-2025 12:00:00 AM

మాజీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 7 (విజయ క్రాంతి): ప్రజలకు సమయం ప్రకారం ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేసేలా చర్యలు తీస్కోవాలని నగర మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు అధికారులను కోరారు. ఆదివారం భగత్ నగర్ క్రే జీ కార్నర్ సమీపంలో వాల్ లీకేజీ మరమ్మ తు పనులను తనిఖీ చేసి పరిశీలించారు. గత కొద్ది రోజులుగా సబంధిత ప్రాంతంలో వా ల్ లీకేజీతో భగత్ నగర్ ప్రాంతంలోని మూ డు డివిజన్ల పరిదిలో ప్రజలకు మంచి నీటి సరఫరా ఇబ్బందులు తలెత్తాయి.

దీంతో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో మాట్లాడి స్థానికంగా ఉండి కొత్త వాల్ వే యించి మరమ్మతు పనులను పూర్తి చేసి మంచి నీటి సరఫరా సమస్యను పరిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడు తూ నగరపాలక సంస్థ సంస్థ అధికారులు నగర ప్రజలకు మంచి నీటి సరఫరా లో ఇ బ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీస్కోవాలన్నారు.

నగర వ్యాప్తంగా ఎక్కడ మంచి నీటి పైపులైన్లలో వాల్ లీకేజీలు ఉన్న పర్యవేక్షించి వాటిని వెంట వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. లీకేజీ సమ స్యలతో మంచి నీటి సరఫరా లో ప్రెషర్ స మస్య ఏర్పడటంతో పాటు నీరు కలుషితమ య్యే అవకాశం ఉందని వాటి పై ప్రత్యేక దృ ష్టి పెట్టి తగిన చర్యలు తీస్కోవాలనితెలిపారు.