15-05-2025 12:00:00 AM
మన ఆలోచన సాధన సమితి కోర్ కమిటీ సభ్యుడు పెద్దవూర బ్రహ్మయ్య
ఎల్బీనగర్ , మే 14 : చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ పోరాటం ఆగదని మన ఆలోచన సాధన సమితి కోర్ కమిటీ సభ్యుడు పెద్దవూర బ్రహ్మయ్య అన్నారు. మండలాలు, గ్రామాల్లో తిరుగుతూ బీసీలను చైతన్య పర్చడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాగోల్ లో మంగళవారం మన ఆలోచన సాధన సమితి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నా యకులు మాట్లాడుతూ.. మండలాల్లో తిరుగుతూ బీసీ కులాలను చైతన్యం చేయాల న్నారు. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే రిజర్వేషన్లు కావాలన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంటులో 18 నుంచి 20 కులాలు అడుగు పెట్టలేన్నారు.
మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ... రిజర్వేషన్లు సాధించడానికి ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో బీసీ కుంచాల బ్రహ్మయ్య, మద్దూరు మహేష్, కానుగుల తిరుపతి, మల్లేష్ గౌడ్, రామస్వామి గౌడ్, భూపేష్ చారి, సునీల్ గౌడ్, నర్సింహ గౌడ్, శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.