02-08-2025 02:30:00 PM
ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్..
సిద్దిపేట క్రైమ్: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకోవాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్(AR Additional DCP Subhash Chandra Bose) సిబ్బందికి సూచించారు. శనివారం సిద్దిపేట శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీక్లీ పరేడ్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించచ్చన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణికుమార్, కార్తీక్, పూర్ణచందర్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు సిద్దిపేట డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.