02-08-2025 02:19:23 PM
నంగునూరు: నంగునూర్ మండలంలోని ఆంక్షపూర్, మగ్దుంపూర్, సిద్దన్నపేట గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు(Former Minister MLA Harish Rao) పరామర్శించారు. కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, లింగం గౌడ్, దువ్వల మల్లన్న, రాగుల సారయ్య, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.