calender_icon.png 2 August, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహచరుడి కుటుంబానికి రూ. 20 వేలు అందజేత

02-08-2025 02:27:49 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేసముద్రం మండల టాక్సీ డ్రైవర్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు రామకృష్ణారెడ్డి అకాల మృత్యువాత పడగా, ఆయన కుటుంబానికి యూనియన్ నుండి 10 వేలు, తోటి సభ్యులు సమకూర్చిన మరో 10 వేల రూపాయలను శనివారం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో కూడా వారికి ఏలాంటి అవసరం వచ్చిన అండగా నిలుస్తామని యూనియన్ అధ్యక్షుడు మహేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పింగిలి సంతోష్, కోశాధికారి నాగనబోయిన నరసయ్య, కార్యవర్గ సభ్యులు సిలివేరు గణేష్, సభ్యులు రావుల అనిల్, గాడిపెల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.