02-08-2025 02:34:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని, రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయని, దీనితో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గా(ICDS Supervisor Durga) వివరించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. మాతా శిశు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆరోగ్య సూత్రాలను, ఆహార అలవాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, రాజకుమారి, కవిత తదితరులు పాల్గొన్నారు.