calender_icon.png 1 August, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

31-07-2025 01:38:03 AM

  1. పీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి 
  2. 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ 
  3. పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): జాతీయస్థాయిలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు బీసీలంతా ఒక్కటిగా ఉద్యమించాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ ప్రతిని ధులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం వారి కి జాజుల శ్రీనివా స్‌గౌడ్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని, బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండే విధం గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జాతీయస్థాయిలో బీసీ ఉద్యమాన్ని ఇంకా బలోపే తం చేయాలన్నారు.

స్థానిక సంస్థలు 42 శాతం రిజర్వేషన్ల పెంపుతో పాటు చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ఓబిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీ ఉద్యమ పోరాట కార్యాచరణను జాతీయ మహాసభలలో రూపొందిం చుకో వాలని వారు సూచించారు. గోవా రాష్ట్రంలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడి యంలో జరిగే జాతీయ పదవ మహాసభలకు దేశం నలుమూలల నుండి హాజరై బీసీల ఐక్యతను చాటాలని, మహాసభలకు తాము కూడా హాజరు అవుతామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బీసీ కుల సం ఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి డి రమ,  నరేష్ ప్రజాపతి, తారకేశ్వరి, స్వర్ణ గౌడ్, సమత యాదవ్, సంధ్య, శ్యామల, గౌతమి, మల్లికార్జున యాదవ్, పానుగంటి విజయ్, ఇంద్రం రజక పాల్గొన్నారు.