calender_icon.png 2 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారులకు మత్స్యశాఖ పథకాలు పెట్టి ప్రభుత్వం అండగా ఉండాలి

01-08-2025 04:54:44 PM

రాష్ట్ర మత్స్యశాఖ ఛైర్మన్ కు వినతి పత్రంలో పెద్దపల్లి మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్స్ క్రాంతి..

మంథని (విజయక్రాంతి): మత్స్యకారులకు మత్స్యశాఖ పథకాలు పెట్టి అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పోతరవేని క్రాంతి(Fisheries Director Potharaveni Kranthi) అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను క్రాంతి మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ లతో కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ... ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాపస్ పంపడం జరిగిందన్నారు.

ఈ ఏడాది నాణ్యమైన పెద్ద చేప పిల్లలను సరైన సమయంలో అందించాలని, అలాగే మత్స్యకారులకు మత్స్యశాఖ పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని కోరడం జరిగిందని,  ఈ సమస్యల పైన రాష్ట్ర ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత ఏడాది లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని, మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి,  పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్  పాల్గొన్నారు.