01-08-2025 05:16:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్ కొరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రెంట్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు.
కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కావున బీసీల కోసం పోరాడుతున్న కవితకు మనమందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ దీక్షకు నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలిరావాలని కోరారు. అనంతరం మహా నిరాహార దీక్ష గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు లక్ష్మణ చారి, ఓడ్డెర సంఘం అధ్యక్షుడు భూపతి, నాయి బ్రాహ్మణ నాయకులు గంగాధర్, తెలంగాణ జాగృతి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.