01-08-2025 05:05:13 PM
- రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ వస్తే బడిలో ఉంటా
- ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది
- కాంగ్రెస్ నాయకులు కారెడ్డి దేవేందర్ రెడ్డి
అడ్డాకుల: ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కారెడ్డి దేవేందర్ రెడ్డి(Congress party leaders Kareddy Devender Reddy) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు మరోసారి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కందూరు గ్రామ అభివృద్ధి దేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. రిజర్వేషన్ వస్తే కందూరు గ్రామం నుంచి ఎమ్మెల్యే సహకారంతో సర్పంచ్ బరిలో ఉంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కందూర్ గ్రామం పై పూర్తిస్థాయిలో పట్టు ఉందని, అందరి మన్ననలు తమపై ఉన్నాయని ఆశ భావం వ్యక్తం చేశారు. నాటి నుంచి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నానని, గ్రామాల్లో ఇండ్ల నిర్మాణంతోపాటు సుదీర్ఘకాలం పాటు రేషన్ కార్డులు ఇవ్వని గత ప్రభుత్వం మంజూరు చేయడంతో పండుగ వాతావరణం సంతరించుకుందని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ ఎవరికి ఆపద వచ్చిన ఎమ్మెల్యే సహకారం తీసుకుంటూ అండగా ఉంటామని తెలియజేశారు. రిజర్వేషన్ వస్తే జరగనున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తమపై ఉంటుందని పేర్కొన్నారు.