01-08-2025 05:03:05 PM
చండూరు (విజయక్రాంతి): కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఎస్ఓ, అధ్యాపకులపై పని ఒత్తిడిని తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మం పార్టీ శంకర్ అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘర్షణ సైకిల్ యాత్ర చండూరుకి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయిగా తప్ప ఆచరణ గడప దాటడం లేదని అన్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8158 స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ, బీసీ పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలో వున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయి బిల్లులు సకాలంలో విడుదల చేయకుండా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఇవ్వం చదువు చెప్పలేమని విద్యార్థులును ఇబ్బంది పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ హాస్టల్ గిరిజన గురుకుల పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వం కనీసం ఒక ప్రత్యేక కమిటీ వేసి విద్యార్థుల ఆత్మ హత్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం శాఖ మంత్రి ఉన్నారు. తప్ప విద్యా శాఖ మంత్రి లేని స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి వున్నా విద్యా రంగంపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేని పరిస్థితి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్, గురుకులాలు అద్దె భవనాలలో విద్యార్థులు అలమటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వారిని కురిసినట్టు ఉందని అన్నారు తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనంలో ఉన్న గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు స్వంత భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ యాత్రలు విద్యార్థుల దగ్గరికి వెళ్లి స్వయంగా విద్యార్థుల సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఎస్ఎఫ్ఐ చేస్తుందని అన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు భవిష్యత్తులో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పాలక ప్రభుత్వాలపైన సమరశీల విద్యార్థి పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సైదా నాయక్, కుంచం కావ్య, కోరే రమేష్, మరుపాక కిరణ్, ముస్కు రవిందర్, స్పందన, సిరి, జగదీష్ జగన్ నాయక్, వీరన్న రాకేష్, సాయి, నవదీప్ ప్రణిత్, మణి, ప్రవిణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.