calender_icon.png 2 August, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 కోట్ల గంజాయి పట్టివేత

31-07-2025 01:36:44 AM

- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘటన

- బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ వద్ద స్వాధీనం

రాజేంద్రనగర్, జూలై 30: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో బుధ వారం రూ.40 కోట్ల విలువచేసే హైడ్రోఫోనిక్ గంజాయిని బుధవారం నార్కోటిక్ కం ట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిం చగా ఆమె వద్ద రూ.40 కోట్ల విలువజేసే 40 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బ్యాంకాక్ నుంచి నేరుగా ఇండియాలోని పలు రాష్ట్రాలకు ఫ్లైట్లు ఉన్నా ఆమె దుబాయ్ మీదుగా భారత్‌కు రావడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గంజాయి ని ఇక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పూర్తి దర్యాప్తు చేపట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.