01-08-2025 04:51:39 PM
శ్రీరాంపూర్ (విజయక్రాంతి): శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్(Shrirampur Police Station)ను శుక్రవారం ఆర్ బివిఆర్ఆర్ డైరెక్టర్, అడిషనల్ డీజీ అభిలాష్ బిస్త్ సందర్శించారు. డైరెక్టర్ కు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్, ఎస్సై సంతోష్ లు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఏఆర్ మహిళా సాయిధ దళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి రిసెప్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి బాధితులు వచ్చినప్పుడు ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకుంటున్నారు, వారి సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లోని రూమ్స్, లాకప్, వుమెన్, మెన్ బ్యారక్ పరిసరాలను, వాష్ రూమ్స్ లను డైరెక్టర్ పరిశీలించారు, టెక్నికల్ రూం, సిసి కెమెరాలను పని తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదు పై సత్వరం స్పందించి సేవలు అందించాలన్నారు. డైరెక్టర్ వెంట మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్, ఆర్ ఐ సంపత్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, లక్ష్మి ప్రసన్న తదితరులున్నారు.