01-08-2025 04:31:05 PM
చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం..
చండూరు (విజయక్రాంతి): గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం(Municipal Commissioner Mallesham) అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలోరెండు సంవత్సరముల వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం మానవసేవే, మాధవ సేవ అని వారు కొనియాడారు. నాలుగు పైసలు సంపాదిస్తే అయినవారిని మరిచిపోతున్న ఈ రోజుల్లో తన కండ్ల ముందు అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం చాలా గొప్పది అని ఆయన అన్నారు.
నిరుపేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అని, గాంధీజీ ఫౌండేషన్ కు ఎక్కువమందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థికంగా ఉన్న మరి కొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అరవింద రెడ్డి, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి, తదితరులు పాల్గొన్నారు.