calender_icon.png 2 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నోటిఫికేషన్ లకు రోస్టర్ అమలుతో మాలలకు అన్యాయం..

01-08-2025 04:57:22 PM

సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులకు వినతి..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ రోస్టర్ అమలులో మాల కులస్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్(Koppula Ramesh) అన్నారు. రోస్టర్ అమలును నిరసిస్తూ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఏవో వర్ణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... రోస్టర్ అమలుతో ధానంగా వర్గీకరణలో గ్రూప్ 3 వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. పాత నోటిఫికేషన్ లో వర్గీకరణ అమలు చేయకూడదు అని, మాల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగరి అశోక్, పాశం రాఘవేంద్ర, స్వామి, మేకల మల్లన్న, గంగన్న, ఉషాన్న, లక్ష్మన్, ప్రభాకర్, రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.