calender_icon.png 9 January, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెజోనెన్స్ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

06-01-2026 12:00:00 AM

కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం

ఖమ్మం, జనవరి 5 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీనివాస నగర్ రెజోనెన్స్ స్కూల్ విద్యార్థులు సౌత్ ఇండియా డబ్ల్యూఎఫ్‌ఎస్‌కేవో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించారు. ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ నెల 4 న నిర్వహించిన పోటిలో ప్రతిభ చూపి అనేక బహుమతులు గెలుచుకున్నారు.

ఈ పోటీలలో ఐన జి.జస్మిత, కే రేష్మ మహి, జి అక్షర పోటీ లో గోల్డ్ మెడల్ సాధించారు. పాఠశాల యాజమాన్యం అయిన ఆర్‌వి నాగేంద్ర కుమార్, నీలిమా మాటాడుతూ.. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించేలా ప్రోత్సహిస్తూ విద్యార్దుల ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్థామని చెప్పారు.