calender_icon.png 9 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే సహించం

06-01-2026 12:00:00 AM

నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పాలడుగు అజయ్ 

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు భూ వివాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలడుగు అజయ్ అన్నారు. సోమవారం కొత్త పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు, అదే గ్రామానికి చెందిన నారబోయిన నరసింహ అనే ఇద్దరు కూడా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారేనని అన్నారు. 

వారిద్దరి మధ్యనే భూ వివా దం నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని జిల్లపల్లి రేణుకను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించడం శోచనీయమన్నారు. గ్రామంలో భూవివాదానికి సంబం ధించి కావాలనే ఆమె కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

రేణుకను కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాము ఎన్నడూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఆమె భూవివాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తుందని తెలిపారు. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ భూ వివాదానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కావాలనే అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నక్క భూపాల్ రాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నక్క వినయ్, నాయకులు పగిడి విగ్నేష్, బోధనపు రాంరెడ్డి, రొమ్ముల నాగయ్య పాల్గొన్నారు.