calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

06-01-2026 12:00:00 AM

  1. ఒకే ఇంటి నెంబర్‌పై 100 ఓట్లు నమోదు..?
  2. సరి చేయాలంటూ అఖిలపక్ష నేతల డిమాండ్ 

మహబూబాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా పూర్తిగా తప్పులు తడకగా మారిందని, వెంటనే అధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, కేసము ద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో ప్రకటించిన ముసాయిదా ఎన్నిక ల జాబితాపై రాజకీయ పార్టీల నేతల అభిప్రాయాలను సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో కేవలం పేర్లతో ప్రకటించడం సరికాదన్నారు.

2020లో ఫోటోలతో కూడిన ముసాయిదా జాబితా విడుదల చేయడం వల్ల తప్పులను వెంటనే గుర్తించి సరి చేయడానికి అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు వార్డుల వారీగా ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఒక చోట అధికంగా మనకు చోట తక్కువగా, అలాగే ఒక వార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటర్లు కాకుండా, పట్టణ పరిధిలోని ఓటర్లను చేర్చడం వల్ల ఎన్నికల ప్రచారం, ఓట్లు వేయడానికి ఓటర్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలి టీల్లో ఇదే తరహా ఇబ్బందులు తలెత్తయనే ఫిర్యాదులు వచ్చాయి.  మహబూబాబాద్ లో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘనపురపు అంజయ్య, బి.అజయ్ సారధి రెడ్డి, మారినేని వెంకన్న, సూర్ణపు సోమయ్య, క్యాచ్వల్ శ్యాంసుందర్ శర్మ, బొమ్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్ర క్రియలో భాగంగా రూపొందించిన మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితాలో స్పష్టం గా పెద్ద ఎత్తున లోపాలు తప్పులు ప్రచురితం అయ్యాయన్నారు.

ముఖ్యంగా మహ బూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్దేశించిన వార్డు భౌగోళిక హద్దుల పరిధిలోనే ఇట్టి సంబంధిత ఓటర్లను ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఇంటిలో అత్యధికంగా నమోదు అయిన ఓట్లను సమగ్రంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ముసాయిదా జాబితాలో 1 నుండి 36 వార్డుల పరిధిలో వార్డు సంబంధిత ఓటర్ల సుమారు 50 శాతం ఉండగా సుమా రు 50 శాతానికి పైగా సంబంధంలేని వార్డు ల నుండి ఓట్లు ప్రచురితమయ్యాయన్నారు. 

సంబంధంలేని వార్డుల నుండి వచ్చిన ఓట్ల ను పరిశీలన విచారణ చేసి సంబంధిత వాస్త వ వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డుకు నిర్దేశించిన పోలింగ్ బూతుల సంఖ్యను మించి సుమా రు 20 నుండి 40 బూతుల వారీగా ప్రస్తు తం ముసాయిదాలో వచ్చాయని, వాటిని నిబంధనల ప్రకారం సరిచేసి సంబంధిత వా ర్డుల్లోని బూత్‌లను మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ రాజేశ్వరరావు కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం లో పెరుగు కుమార్, నీరుటి సురేష్ నాయు డు, ఎండి ఫరీద్, భానోత్ సీతారాం, పల్లె సందీప్, పిబి రామారావు పాల్గొన్నారు.