calender_icon.png 2 January, 2026 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉపాధి’ని రద్దు చేసే బిల్లు వెనక్కి తీసుకోవాలి

29-12-2025 12:59:52 AM

గాంధీల పేర్లు చరిత్రలో లేకుండా బీజేపీ కుట్ర 

మంత్రులు పొన్నం, వివేక్, అజారుద్దీన్

హైదరాబాద్, డిసెంబర్  28 (విజయక్రాంతి): మహాత్మగాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు చరిత్రలో లేకుం డా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్ మండిప డ్డారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆదివారం మంత్రులు అజారుద్దీన్, వివేక్ వెంట స్వామితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మా ట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేయడంమే కాకుండా రాష్ట్రాలపై భారం మోపే విధంగా 60:40 శాతం నిధు లు ఉండేలా చేస్తోందని వివరించారు. మం త్రులు వివేక్, అజారుద్దీన్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పథకాలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపో యిందన్నారు. సోషల్ మీడియాలో తప్ప ప్రజల్లో బీఆర్‌ఎస్ స్థానం లేదన్నారు.