calender_icon.png 2 January, 2026 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొండికుంట సమీపంలో కేఎల్ఆర్ స్కూల్ బస్ బోల్తా

02-01-2026 02:41:41 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): ఓవైపు రోడ్డు ప్రమాదాల నివారణ పై ఆర్టిఏ అధికారులు  భద్రతా వారోత్సవాల పేరిట హడావుడి చేస్తుండగా,  పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ ప్రైవేట్  కళాశాల యాజమాన్యం బస్సు మణుగూరు నుండి పాల్వంచకు తీసుకు వెళ్తున్న క్రమంలో  శుక్రవారం ఉదయం మండల పరిధిలోని మొండి కుంట గ్రామానికి సమీపంలోని సాయి బాబాగుడి వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో 60 మంది విద్యా ర్థులకు గాయాలు కాగా ఇందులో ఇద్దరు విద్యా ర్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరొక విద్యార్థి బస్సులోనే ఇరుక్కు పోయారు.విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత బస్సు కావటం స్టీరింగ్ పట్టి వేయడంతో  డ్రైవర్ బస్సు వేగాన్ని కంట్రోల్ చేయకపోవడంతోని ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. విద్యార్థులను తరలించే స్కూల్ బస్ ను తనిఖీలు చేసి  ఫిట్నెస్ సర్టిఫికెట్లను మంజూరు చేసే ఓ ఆర్టిఏ అధికారి కళాశాల యాజమాన్యం ఇచ్చే ముడుపులకు అలవాటు పడి   ఈ బస్ కు ఫిట్నెస్ అనుమతులు, పర్మిషన్లు ఇచ్చి  చేతులు దులుపుకున్నారని, ప్రమాదానికి బాధ్యత ఆ అధికారి  వహిస్తారా, లేదా యాజమాన్యం వహిస్తుందా అని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కాగా ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలు స్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసు పత్రులకు ఇతర వాహనాల్లో తరలించా రు.ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా, సమాచారం అందిన వెంటనే అశ్వాపురం సిఐ  గూడ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘ టన స్థలా నికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. విద్యార్థులను స్కూళ్లకు కళాశాలకు తరలించే  ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలకే కాలం చెల్లిన బస్సులను కొనుగోలు చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

మరో వైపు బస్సులను తనిఖీలు చేసే ఆర్టిఏ అధికారుల పట్టింపే లేని కారణంగా తనిఖీలు శూన్యంతోనే తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయ ని అలాంటి అధికారులపై  ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.కాలం చెల్లిన బస్సులతో  విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడు తున్న ప్రైవేట్ పాఠశాల,కళాశాలయా జమాన్యాలఫై చర్యలు తీసుకోవాలని స్కూల్ బస్సుల భద్రతను సమీక్షించి విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించా లని ఆయా విద్యార్థి v నాయకు లు డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై   బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతా రావు స్పందించారు. ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను వైద్యశాలకు  తరలించేందుకు తన వంతు సహకారం అందించారు.