29-12-2025 01:01:04 AM
ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్ష
మహబూబాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): క్రీడా పోటీల్లో మహబూ బాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కోరారు. మహబూబాబాద్ నెట్బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మూడు రోజులు కేసముద్రం పట్టణంలో ఘనం గా నిర్వహించిన సందర్భంగా, నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేం వాసుదేవ రెడ్డిని ఎంపీ, ఎమ్మెల్యే అభినందించారు.
గత మూడు రోజులుగా జరిగిన క్రీడలలో మూడు విభాగాల నందు ట్రెడిషనల్, ఫాస్ట్ 5, మికస్డ్, జరిగిన పోటీల్లో మహబూబాబాద్ జిల్లా జట్టు ట్రెడిషనల్ సీనియర్స్ విభాగములో మొదటి స్థానం కైవసం చూసుకోవడం, మికస్డ్ విభాగంలో తృతీయ స్థానం సాధించడం పట్ల క్రీడాకారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇతర క్రీడల్లో చూపించి మహబూబాబాద్ జిల్లా పేరును రాష్ట్రవ్యాప్తంగా గుర్తించే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నెట్ బాల్ మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ సురేష్, ఏం యాకుబ్ రెడ్డి, పిడి కొప్పుల శంకర్, ఎల్.సంతోష్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, కే .రాకేష్ రెడ్డి, పుల్ల శ్రీనివాస్ యాదవ్ , పి.వెంకట్ రెడ్డి, జి.సదానందం తదితరులు పాల్గొన్నారు.