calender_icon.png 13 May, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనికులకు పుట్టినిల్లు అడవి మామిడిపల్లి

12-05-2025 01:07:45 AM

  1. ఆపరేషన్ సిందూర్లో 8 మంది భాగస్వామ్యం
  2. 24 ఏళ్లలో 22 మంది ఆర్మిలోకి..

నిజామాబాద్ మే 11:(విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలోని అడవి మామిడిపల్లి గ్రామం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.  ఆపరేషన్ సింధు నేపథ్యంలో జిల్లాలోని అడవి మామిడిపల్లి గ్రామం చర్చల్లో నిలిచింది.

ఈ గ్రామంలో కుటుంబాలు పూర్తి వ్యవసాయంపై ఆధారపడి ఉండగా ఇదే గ్రామం నుండి దేశ రక్షణకై దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న జవానులు కూడా ఉన్నారు దేశ సరిహద్దుల్లో 8 మంది జవాన్లు ఈ గ్రామం నుండి ఉండి విధులు నిర్వహిస్తున్నారు.

ఈ గ్రామంలోని యువకులకు దేశభక్తి అన్న దేశ సంస్కృతి అన్న ఎంతో అభిమానం ఆ నేపథ్యంలోనే దేశ సేవకై యువకులు ఆర్బిలో చేరి తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించడం గర్వంతో చెప్పుకోదగ్గ విషయం. గ్రామ సరిహద్దుల్లో శత్రు దేశాలతో శత్రు సైన్యంతో పోరాడుతూ దేశానికి రక్షణగా నిలుస్తున్న తమ పిల్లలను చూస్తే తమ గర్వకారణంగా ఉందని తాము ఎంతో గర్వపడుతున్నామని జవాన్ల కుటుంబ సభ్యులు గ్రామస్తులు దేశ భక్తి భావంతో కూడిన ఉత్సాహంతో కూడిన హర్ష నీ వ్యక్తం చేస్తున్నారు.

దేశ రక్షణలో తమ గ్రామ పౌరులు సైనికులుగా ఉండడం తాము గర్వపడుతున్నామని ముక్తకంఠంతో చెబుతున్నారు.  తమ గ్రామానికి మంచి పేరు తెస్తూ నిజామాబాద్ జిల్లాని కూడా రాష్ట్రస్థాయిలో నిలిపారు గత 22 సంవత్సరాలుగా 22 మందికి పైగా యువకులు ఆర్మీలో ఐటిబిపి ఇండో టిబెటన్ పోలీస్ దళాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు గ్రామాలలోని మరికొంతమంది యువతకు ఆదర్శంగా నిలిచారు తెలంగాణలోనే ఈ ఊరు ప్రత్యేకతను చాటుతూ అడవి మామిడిపల్లిగా ఉన్న ఈ గ్రామాన్ని జైహింద్ మామిడిపల్లి అని పిలిచేవి స్థాయికి తీసుకొచ్చారు.

అడుగడుగునా దేశభక్తి ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తోంది అనంతరం ఊరి మధ్యలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం తర్వాత మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి దేశభక్తి స్ఫూర్తిగా ఈ గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఆర్మీలో ఉన్న మామిడిపల్లి యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకై విధులు నిర్వహిస్తున్నారు పంపించడం తల్లిదండ్రుల ధైర్యాన్ని చూస్తే మనందరికీ ఎంతో గర్వంగా స్ఫూర్తిగా ఉంటుంది.

జై జవాన్ జై కిసాన్ స్ఫూర్తిని చాటుతున్న ఈ గ్రామంలో యువకులు ఆర్మీలో ఉండడం ఎంతో ప్రత్యేకత చాటుతోంది. ఆర్మీ ఉద్యోగ విరమణ తర్వాత తమ గ్రామంలోని వ్యవసాయం చేస్తూ దేశ సేవ అంకితం అవుతామని ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన సైనికులు చెబుతున్నారు.

యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం పిలిస్తే తక్షణమే విధుల్లో చేరి శత్రుదేశంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెబుతున్నారు ఈ దేశ మాజీ సైనికులు వీరి మాటలు యువతకు ఆదర్శంగా ఉండి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వీరు మాట్లాడే ప్రతి మాటలో దేశభక్తి దేశానికి సేవ చేయాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది.

అదృష్టంగా భావిస్తున్నా

నా కొడుకు గంగోని బాలాజీ సైన్యంలో చేరి ఆరు సంవత్సరాల పైగా అవుతోంది దేశభక్తి నిండుగా ఉన్న నా కుమారుడు పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధం ఆపరేషన్ సింధూరం లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఎంతో గర్వంగా ఉంది నా కొడుకు మిలిటరీ ఇచ్చిన శిక్షణలో 6 తేదీ ఉన్నాడు శత్రువును దెబ్బతీయడంలో ముందు ఉంటాడు ధర్మబద్ధంగా జరుగుతున్న ఈ యుద్ధంలో నా కొడుకు విజయుడై నిలుస్తాడు.

 గంగోనే కిషన్,  ఆర్మీ మ్యాన్ బాలాజీ తండ్రి 

మా ఊరి రాణి 

పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నాకు కాస్త బెంగగా ఉంది నాకు ఒకే ఒక కుమారుడు రాజేష్ ఇష్టంతోనే సైన్యంలో చేరాడు రాజేష్ తండ్రి చిన్నతనంలోనూ చనిపోయాడు. వాడికి సర్వస్వం నేనే అయి పెంచాను ఒకవైపు నా కొడుకు ఆర్మీ ని ఎంపిక చేసుకొని భారతదేశం తరఫున పోరాటం గర్వంగా ఉంది మరోవైపు నా కొడుకుకి ఏమి హానీ జరుగుతుందో అని బెంగగా కూడా ఉంది నా కొడుకు ఎంతో ధైర్యవంతుడు కాబట్టే ఈ ఆర్మీ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు తప్పక విజయ్యుడై నిలుస్తాడు.

 భారత ఆర్మీ సైనికుడు మా ఊరి రాజేష్ తల్లి 

ఎంతో గర్వంగా ఉంది 

పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో నా కొడుకు పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎంతైనా తల్లిని కదా మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా కూడా ఉంది. రోజు యుద్ధంలో వివిధ సంఘటనలు జరుగుతున్నాయి టీవీల ద్వారా తెలుస్తోంది.

నా కుమారుడు సమయం దొరికినప్పుడు ఫోన్లో మాట్లాడుతాడు అక్కడ అంతా బాగానే ఉందని చెప్తూ ఉంటాడు కానీ సైనికుడు రాళ్లు రప్పల మధ్య భోజనం చేస్తుండడం చూసి నా మనసు జలించింది. ఏది ఏమైనప్పటికీ భారతదేశం తరఫున నా కొడుకు శత్రువులతో పోరాడుతుండడం నాకెంతో గర్వంగా ఉంది ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను.

 జయమ్మ భారత ఆర్మీ సైనికుడు సాయికుమార్ తల్లి 

నాకెంతో గర్వంగా ఉంది 

నా ఇద్దరి కొడుకులు భారత ఆర్మీలో చేరి ప్రస్తుతం యుద్ధంలో ఉన్నారు. శ్రీకాంత్ నవీన్ ఇష్టంతో ఇద్దరు మిలటరీలో చేరారు వారు పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారు నా కొడుకు గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంది ధర్మబద్ధంగా జరుగుతున్నాయి యుద్ధంలో అంతా మంచే జరిగి ధర్మం వైపు ఉన్న మన దేశము మన సైన్యం గెలుస్తుంది.

 పాల్ద సాయమ్మ 

ఆర్మీ సైనికులు శ్రీకాంత్ నవీన్ తల్లి

* అడవి మామిడిపల్లి గ్రామం నుండి భారతమాత సేవకై భారత దేశ పరిరక్షణకై ఆర్మీలో చేరి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సంరక్షణలో శత్రువులతో పోరాడుతున్న మామిడిపల్లి యువతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశ రక్షణకై ఆర్మీలో చేరాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను.

భారత సైనికులుగా చేరి మామిడిపల్లి గ్రామం తో పాటు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు పేరు తెచ్చిన మామిడిపల్లి ఆర్మీ సైనికులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు మామిడిపల్లి గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించి యువతకు మరింత స్ఫూర్తినిచ్చే శిక్షణ కార్యక్రమాలు మామిడిపల్లిలో చేపట్టి వారిని ప్రోత్సహించే బాధ్యత మనందరిపై ఉంది.

 దినేష్ కులచారి, 

బిజెపి జిల్లా అధ్యక్షులు నిజామాబాద్