calender_icon.png 25 August, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇండ్ల స్థలాలను.. పెద్దలు కబ్జా చేస్తుండ్రు

25-08-2025 01:09:43 AM

 సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 24: అర్హులైన పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను పెద్దలు కబ్జాలు చేస్తున్నారని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అబ్దుల్లాపూర్‌మె ట్ మండలం లష్కర్‌గూడ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 84లో ప్రభుత్వ ఉంది. ఇందులో అర్హులైన పేదలకు 1996లో సర్టిఫికెట్లు ఇచ్చారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తుంటే.. సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో భూమి మీదకు వెళ్లి.. జెం డాలు పాతారు.

ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. గత 29 ఏండ్ల క్రితం లష్కర్‌గూడ గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. 84 సర్వే నెంబర్లు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుందని.. ఆ భూమిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించిన పేదల ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని రక్షించి.. అర్హులైన లబ్దిదారులకు ప్లాట్లు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

లబ్దిదారులతో కలసి 84 సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని చదును చేసి.. అక్కడ జెండాలను పాతినట్లు తెలిపారు. లబ్దిదారులకు ప్లాట్లు దక్కేంతరకు సీపీఎం పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, నాయకులు వర్కాల ముత్యాలు, మేడిపల్లి శ్రీశైలం, గుండె శివకుమార్, సత్యనారాయ ణ, సుమలత, శీను, బిక్షపతి, గుండె ఉషయ్య, శ్రీనివాస్, జి యాదయ్య, హరీష్, పట్టా సర్టిఫికెట్లు ఉన్న లబ్దిదారులందరూపాల్గొన్నారు.