18-10-2025 07:53:28 PM
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
వనపర్తి టౌన్: కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో ఓ లాగా కేంద్రంలో మరో లాగా వ్యవహరించడం తగదని రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు 42 శాతం బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకోవడం డబల్ ఇంజన్ సర్కార్ ద్వంద వైఖరి ఇట్టే అర్థమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణలో బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో చేపట్టిన బంధు కార్యక్రమంలో భారీ బైక్ ర్యాలీ క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా వివిధ పుర వీధుల మీదుగా రాజీవ్ చౌరస్తాకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ ద్వంద వైఖరిని విడనాడి 42శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు.రాజ్యాంగ సవరణతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని 56% జనాభా ఉన్న బీసీ బిల్లుకు 42 శాతం రిజర్వేషన్తో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలిపాయని నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లపై స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్, పట్టణ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.