29-10-2025 08:09:41 PM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో రోడ్డు ఇరువైపులా మట్టి పెరిగిపోవడంతో వర్షం నీరు, పోవడానికి దారి లేక, నీరు రోడ్డుపైనే ఆగిపోవడంతో, విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు మహమ్మద్ రఫీ, నీళ్లు పోవడానికి జెసిబి, ట్రాక్టర్ సహాయంతో సమస్యను పరిష్కరించడం జరిగింది.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఇరువైపులా ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలు కూడా తొలగించారు. పట్టణ కేంద్రం లొ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కోతులను, కుక్కలను, పట్టించి వాటిని అడివిలో వదిలేయడంతో పాటు మండలం కేంద్రంలో ఉన్న పలు గ్రామాలలో, పట్టణంలో ఆయన చేస్తున్న సేవలకు సిటీజన్ లు హర్షం వక్తం చేసారు.