calender_icon.png 29 October, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ కి నీట మునిగిన వరి పంట..

29-10-2025 08:10:26 PM

లబోదిబోమంటున్న రైతులు..

కోదాడ: మొంథా తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట నేలకొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మాట్లాడారు. అధికారులు ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి పంట అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.