calender_icon.png 11 January, 2026 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్పను సందర్శించిన రష్యా పర్యాటకులు

06-01-2026 12:00:00 AM

వెంకటాపూర్, జనవరి 5 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ రామప్ప (రుద్రేశ్వర) దేవాలయాన్ని సోమవారం రష్యా దేశానికి చెందిన ఇరినా, అమీయా దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, కట్టడాల విశిష్టతను టూరిజం గైడ్ గోరంటల విజయ్కుమార్ వివరించగా, రష్యా పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ను ఆస్వాదించారు. ఈ పర్యటనలో పురావస్తు, దేవాదాయ శాఖల సిబ్బంది, టూరిస్ట్ పోలీసులు పర్యాటకులతో పాటు ఉన్నారు.