calender_icon.png 17 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి చెంతకు చేరిన బాలుడు

17-08-2025 12:31:17 AM

మల్కాజిగిరి, ఆగస్టు 16 : ఇంటి నుండి తప్పిపోయిన మాటలు సరిగ్గా రాని బాలుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు సురక్షి తంగా అప్పగించారు. వివరాల్లోకి వెళితే శనివారం ఉదయం 11 గంటల సమయంలో నిర్మల్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 11 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు గుర్తించి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బాలుడు మాటలు సరిగ్గా రాకపోవడంతో తన వివరాలు చెప్పలేకపోయాడు.

ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ వెహికల్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి బాలుడి ఫోటో ఆధారం గా స్థానికులతో సంప్రదించి భవాని నగర్, ఏఎస్రావు నగర్ వాసిగా గుర్తించారు. వెంట నే అతని తల్లి మౌనిక రెడ్డిని సంప్రదించి బాలుడిని సురక్షితంగా ఆమెకు అప్పగించారు. తప్పిపోయిన కుమారుడిని వెతుకు తున్న మౌనిక రెడ్డి తన కొడుకును చూసి కన్నీరు పెట్టుకొని కౌగిలించుకుంది. కుమారుడిని తమ వద్దకు చేర్చిన హెడ్ కానిస్టేబుల్ రామస్వామికి కృతజ్ఞతలు తెలియజేసింది.