calender_icon.png 28 January, 2026 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

28-01-2026 12:18:58 AM

పీసీసీ వైస్ ప్రెసిడెంట్  డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్ జనవరి 27 (విజయక్రాంతి): సమాజానికి కేవీఎస్ రామశర్మ చేసిన సేవలు వెలకట్టలేనివని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. ఐత చిరంజీవి, అంటోని, సెల్వరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత సామాజిక సేవకులు కెవిఎస్ రామశర్మ మెమోరియల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం న్యూ బోయిగూడ సెయింట్ జాన్ మరియా వియాని చర్చి గ్రౌం డ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుంద న్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యం ఐక్యత స్నేహభావం పెరుగుతుందని చెప్పారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చని పేర్కొన్నారు.

ఆటల్లో గెలుపోటలములు పట్టుంచుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు పెద్దపీఠ వేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూ నివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కోట నీలిమ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.  ఈ కార్యక్రమంలో పాండు గౌడ్, నారాయణ, కృష్ణ ముదిరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.