17-05-2025 12:56:07 AM
మహబూబ్‌నగర్, మే 16 (విజయక్రాంతి)/చేవెళ్ల/శేరిలింగంపల్లి: తెలంగాణలోని దర్శనీయ, పర్యాటక ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దటూరులోని ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శిం చారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిని సందర్శిం చి, రోగులకు బహుమతులు అందజేశారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొంది, భారతదేశంలోని అతిపెద్ద వృక్షంతో ప్రత్యేక స్థానం సాధించిన మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వద్ద సందడి చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి 22 దేశాల సుందరీమణులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రి చేరుకున్నారు. వారికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతం పలికారు.
వారికి వాయిద్యం, నాదస్వర, కోలాటాలతో స్వాగ తం పలికారు. ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగి రెడ్డి ఆలయ ప్రాశస్త్యం, విగ్రహాలు, మ్యూ జియంలో ఏర్పాటు చేసిన వివిధ శాసనాల గురించి వివరించారు. ఆలయ ఆవరణలో అందగత్తెలు ఫొటోలు దిగారు. తర్వాత స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. డీఎఫ్‌వో సత్యనారాయణ పిల్లలమర్రి చరిత్ర గురించి సుందరీమణులకు వివరించారు.
మన సంస్కృతి ప్రపంచానికి చాటాలి: మంత్రి జూపల్లి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ సుందరీమణుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కృష్ణారావు అన్నారు. శతాబ్దాలుగా, లెక్కలేనన్ని మంది సాధువులు, ఆధ్యా త్మికవేత్తలు పిల్లలమర్రి వృక్షశాస్త్ర అద్భుతాన్ని వర్ణించారని చెప్పారు. పవిత్రమైన మర్రిచెట్టు వైభవం దాని అనేక ఊడలు, కొ మ్మలు, పచ్చదనంతో నిండిన విశాలమైన విస్తీర్ణంలో ఉందని వివరించారు.
ఇది భారతదేశంలోనే పురాతనమైన జీవన మర్రి చెట్ట ని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి గర్వకారణం పిల్లలమర్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే లు మధుసూదన్‌రెడ్డి, శంకర్, శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, పర్ణికరెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎస్పీ జానకి పాల్గొన్నారు.
ఎక్స్‌పీరియం పార్కులో సందడి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దటూరులో 250 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో సుందరీమణులు సందడి చేశారు. మిస్ వరల్ ఆసియా- ఓషియానియా గ్రూప్ నుంచి 24 మంది పోటీదారులు ఈ పార్కును సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ, టూరిజం ప్రమోషన్‌లో భాగంగా పార్కును సందర్శించి, అక్కడ ఉన్న అరుదైన మొక్కల, వృక్ష జాతులు, శిల్పకళా సంపదను వీక్షించారు. అంతకుముందు సంప్రదా యబద్దంగా డోలు, మేళతాలాలతో సుందరీమణులకు స్వాగతం పలుకడంతో పాటు గజ్జెలతో అలంకరించారు. అక్కడి విశేషాలను నిర్వాహకులు వివరించారు
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి సందర్శన
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సుందరీమణులు సందర్శించారు. ఆస్పత్రిలోని రోగులను పరామర్శించారు. ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వైద్య పర్యాటక కార్యక్రమంలో ఆఫ్రికా గ్రూప్ నుంచి 25 మంది మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొన్నారు. వీరికి సాంప్రదాయ దుస్తులు ధరించిన తెలంగాణ యువతులు గులాబీ రేకులను చల్లుతూ, ప్రత్యక్ష షెహనాయ్ ప్రదర్శనతో ఎర్ర తివాచీ స్వాగతం పలికారు.
ఆసుపత్రి ప్రత్యేకతల గురించి ఏఐజి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అందాల భామలకు వివరించారు. అందాల భామలు తమ కటౌట్లతో పాటు ఫొటోలకు పోజులిచ్చారు. కటౌట్‌లపై సంతకాలు చేశారు. రోగులకు బహుమతులు ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సుజన ప్రియ, డాక్టర్ జి.వి.రావు, డాక్టర్ లక్ష్మి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అందాలభామలకు వివరించారు.