calender_icon.png 17 May, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా బెల్టుషాపుల దందా

17-05-2025 12:40:53 AM

- బహిరంగ గానే విక్రయాలు

- అడ్డు అదుపు లేకుండా సాగుతున్న వైనం 

- గల్లీగల్లీకి బెల్ట్ షాపుల నిర్వహణ 

- బెల్టు షాపులు తొలగించాలని కోరుతున్న యువత

- బారులను తలపిస్తున్న బెల్ట్ షాపులు 

- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు

- బెల్ట్ షాప్ ల వద్ద గొడవలు ఘర్షణలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు

కామారెడ్డి, మే 16,(విజయ క్రాంతి): విచ్చలవిడిగా బెల్టు షాపుల దందా కొనసాగు తుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గల్లీ గల్లీకి బెల్టు షాపుల దందాను కొనసాగిస్తున్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో సైతం కోడి కూయకముందే మద్యం బెల్ట్ షాపుల్లో దొ రుకుతుంది. మద్యం ప్రియులు ఉదయం నుంచి బెల్ట్ షాప్ ల వద్దకు వెళ్లి క్యూ కడుతున్నారు.

అరికట్టాల్సిన అధికారులు మా మూళ్ల మత్తులో తూ గుతున్నారు. బెల్టు షాపుల్లో మద్యం సేవించి సామాన్యులు ప్రా ణాలు కోల్పోతున్నారు. కుటుంబాలలో కలతలు రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లా నస్రు ల్లాబాదులో తాగేందుకు కన్నకొడుకే తండ్రి ని హతమార్చాడు. ఇలాంటి ఘటనలు జిల్లా లో ఒక ఏడాదిలో పదికి పైగా సంఘటనలు జరిగి మృతి చెందారు. జిల్లా ఉన్నతాధికారులు ఎక్సైజ్, పోలీస్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా బెల్ట్ షాపుల్లో మద్యంఏరులై పారుతున్నది. ఊరురా ఎంత లేదన్న నాలు గు నుంచి ఐదు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి.

పెద్ద గ్రామాలైతే రెట్టింపు స్థాయిలో నడుస్తున్నాయి. అడ్డుకునే వారే అండదండ లు అందించడంతో గ్రామంలో జోరుగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వైన్స్ యజమానుల కనుసన్నాల్లో ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్స్ యజమానులు బెల్ట్ షా పుల నుంచి ప్రతినెల డబ్బులు వసూలు  చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

t సా యంత్రం అయిందంటే చాలా మధ్య ఎం దుకు అన్నాడు జాతరను తలవిస్తున్నాయి. వయసు సంబంధం లేకుండా పిల్లలకు సైతం మధ్య ఆమ్ముతున్నారు. అనేకచోట్ల రోడ్ల వెంట దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి రోడ్లపైనే తాగేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు చూసి చూడనట్లు  వ్యవహరించడంతో గ్రా మాల్లో బెల్ట్ షాపుల వ్యాపారం మూడు పూలు .. ఆరు కాయలు అన్న చందంగా సాగుతుంది.

గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు 

కామారెడ్డి జిల్లాలో ప్రతి పల్లెలో మద్యం బెల్ట్ షాపులు ఊరూరా విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులు ద్వారా   మ ద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామాలలో పుట్టగొడుగుల బెల్ట్ షాపులు వీధి వీధికి ఏర్పాటుచేసి విక్రయా  లు కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి బెల్టు షాపుల  నిర్వాహ కులు యదేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో పుట్టగొడుగుల పుట్టుకొ స్తున్న బెల్ట్ షాపులకు వైన్ షాప్ ల ద్వారా అమ్మకాలు చేపడితే వైన్ షాపులో లైసెన్స్లను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీచేసిన అవి ఏవి పట్టించుకోకుండా మం డల కేంద్రంలోని ప్రధాన వైన్ షాప్ ల ద్వా రా బెల్టు షాప్ లకు యదేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు.

బెల్ట్ షాపుల నిర్వాహనకు మ ద్యం దుకాణదారులు పూర్తిస్థాయిలో ప్రోత్సహించడంతో వాడు మద్యాన్ని అరువుపై కూడా ఇస్తున్నారు. మద్యం అమ్మిన తర్వాతే డబ్బులు వైన్స్ యజమానులు తీసుకుంటున్నారు.ప్రతి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. పర్యవేక్షణ చేయాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంతో సిండికేట్ వ్యాపారులు గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణను దర్జాగా కొనసాగిస్తున్నారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకా ణంలోనే మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉండగా వచ్చిన స్టాకు వచ్చినట్టే బెల్ట్ షాపులకు బాహాటంగానే వైన్స్ షాపుల నిర్వా హకులు తరలిస్తున్నారు. 

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు 

పట్టణాల్లో,గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు బెల్ట్ షాప్ నిర్వాహకులు వద్ద మామూలు తీసుకొని గ్రామాలలో బెల్ట్ షాపులే లేవన్నట్లుగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని జిల్లా ప్రజలు ఆరో పిస్తున్నారు ప్రభుత్వం ఒకపక్క బెల్టు షాప్ లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికలను వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాప్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ప్రతి నెల మామూలు ముట్ట జెప్పుతుండడంతో అధికారులు బెల్ట్  షాపుల లో అమ్మకాలు జరుగుతున్న అధికారులు పెడచెవిన పెట్టి వారి పని వారు  చేసుకుం టున్నారు.

బెల్ట్ షాపులను తొలగించాలని వినతి 

గ్రామాలలో, పట్టణాల్లో యువకులు, వృ ద్ధులు, మహిళలు ,సైతం మద్యానికి బానిసై తమ విలువైన జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని మం డలాల్లో ఇదే పద్ధతి కొనసాగుతుంది. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద, నాగిరెడ్డిపేట గ్రామాలలో కొంతమంది యు వకులు గ్రామాల్లో ఏర్పాటు చేసి ఏదేచ్ఛగా కొనసాగుతున్న మద్యం, బెల్టు షాపు దుకాణాలను వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రలను అందజేశారు.

నాగిరెడ్డిపేట గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మూడు మద్యం బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారని దీంతో గ్రామంలో యువత వృద్ధులు మద్యానికి బానిసై ఆరో గ్యం పాలవుతున్నారన్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు తెల్లవారుజామున 6 గంటల నుం చి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తుండడంతో మద్యానికి బానిసై కొన్ని కుటుం బాలు ఆర్థికంగా మానసికంగా చిన్నాభిన్నమై గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంద అన్నారు.

కామారెడ్డి జిల్లా నాగిరె డ్డిపేట మండలంమాల్ తుమ్మెద గ్రామంలో సైతం బెల్ట్ షాప్ ను విచ్చలవిడిగా కొనసాగిస్తూ ప్రజలను మద్యానికి బానిసలు మారు స్తున్నారని గ్రామంలోలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను అధికారులు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు. మండలానికి ప్రభు త్వం ఒక మద్యం దుకాణాన్ని మంజూరు చేసింది. ఈ షాపు ద్వారానే మండలంలోని కొన్ని గ్రామాలలో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.

మరికొన్ని గ్రామాల్లో ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, పట్టణ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోని వై న్స్  షాపుల ద్వారా మద్యం కొనుగోలు చే స్తూ గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో బెల్ట్ షాపు నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో బెల్ షాపుల నిర్వాహకులు అధికారులకు మామూలు ముట్టజెప్పడంతో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు బె ల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

బెల్ట్ షాపులు పై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం 

కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా బెల్ట్‌c షాపులు నిర్వహిస్తున్న వారిని గుర్తించి మద్యం స్వాధీనం చేసుకుంటున్నాం. బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తు న్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బెల్టు షాపుల నిర్వహణ అడ్డుకుంటున్నం.

హనుమంతరావు, ఎక్సైజ్ సూపర్డెంట్, కామారెడ్డి,