calender_icon.png 17 May, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కొండా మాట్లాడింది నిజమే

17-05-2025 01:00:56 AM

మంత్రుల అవినీతిపై విచారణ జరపాలి: కేటీఆర్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): మంత్రుల అవినీతి విషయంలో మంత్రి కొండా సురేఖ పూర్తి నిజాలే మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కమీషన్లు లేకుండా మంత్రులు సంతకం చేయడం లేదని ఆమె ఉన్న విషయమే చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజాలు చెప్పినందుకు కొండా సురేఖను తాను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్‌గా మారిపోయిందని, ఇది చాలా బాధాకరమన్నారు.

30 శాతం కమీషన్ లేకుండా మంత్రులు సంతకం చేసే పరిస్థితి లేదన్నారు. సెక్రటేరియేట్‌లో కాంట్రాక్టర్లు కమీషన్ వ్యవహారంపై ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రుల అవినీతిపై మాట్లాడిన కొండా సురేఖ వారెవరో బయటపెట్టాలన్నారు. మంత్రుల అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ విచారణకు ఆదేశిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.