13-09-2025 06:57:54 PM
ఈర్ల రాజు
అమీన్ పూర్ (విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపల్ ఐలాపూర్ తాండ గ్రామ పెద్దలు, సేవాలాల్ మహారాజ్ దీక్ష తీసుకున్న స్వాములు అమీన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ బోధనలు మనకు మార్గదర్శకం, ఆయన చూపిన నడవడి మార్గంలో నడిస్తే సమాజం అభివృద్ధి అవుతుందని, యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ సేవ చేయాలని, ఐక్యతగా ఉండాలి అని భక్తి భావంతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మండల భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు బాబు నాయక్, సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్, పరుశురాం నాయక్, లోకేష్ నాయక్, యువకులు పాల్గొన్నారు.