calender_icon.png 13 September, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

యూరియా కోసం రైతుల ఆందోళన

13-09-2025 06:37:02 PM

విండో కార్యాలయం సిబ్బందిపై దాడికి యత్నం

పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన విరమించిన రైతులు

విండో సిబ్బందికి రైతుల మధ్య వాగ్వాదం

పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతులకు టోకెన్ల పంపిణీ

కామారెడ్డి జిల్లా బిబిపేటలో ఘటన

కామారెడ్డి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ ముందు క్యూ లైన్ లో కూర్చున్న ది ఎందుకో కాదు. రైతులు యూరియా కోసం టోకెన్ల కోసం పోలీసులు క్యూ లైన్ లో కూర్చోబెట్టగా పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు టోకెన్ల కోసం కూర్చున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియా పంపిణీలో విండో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విండో సిబ్బందిపై రైతులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బిబిపేట విండో కార్యాలయంలో రైతులు యూరియా బస్తాల కోసం వచ్చి క్యూ కట్టారు. 600 యూరియా బస్తాలు మాత్రమే రావడంతో తమకు కూపన్లు వస్తావో రావో  అని రైతులు ఆందోళనకు గురయ్యారు.

రైతులు తోపులాడుకోవడంతో విండో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు విండో సిబ్బందిపై దాడికి యత్నించారు. కుర్చీలు తీసి బయట విసిరివేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చేరుకొని రైతులకు సముదాయించారు. మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బిబిపేట మాజీ ఎంపీపీ లో వచ్చి రైతుల సమస్యను విండో అధికారులతో చర్చించారు. కొందరికి యూరియా బస్తాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్ల వారిగా పంపిణీ చేయాలని వారు కోరారు.

విండో సిబ్బంది చేతివాటం వల్ల ఘర్షణ వాతావరణం వాటిల్లిందని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. పోలీసులు సముదాయించడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులందరికీ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి పిలిచి కూర్చోబెట్టారు. క్యూలైన్లో కూర్చున్న వారికి టోకెన్లు అందరికీ అందిస్తామని పోలీసులు నచ్చ చెప్పడంతో పోలీస్ స్టేషన్కు వచ్చి రైతు లు కూర్చున్నాలు. టోకెన్లు పంపిణీ చేసి టోకెన్ నెంబర్ వారిగా రైతులకు యూరియా పంపిణీ చేశారు. మిగతా రైతులకు త్వరలో వస్తాయని పోలీసులు సముదాయించారు. దీంతో వాగ్వాదం సమసి పోయింది.

కామారెడ్డిలో మూడు రోజుల కోసం టోకెన్ల పంపిణీ

కామారెడ్డి విండో పరిధిలోని రైతులకు శనివారం కామారెడ్డిలో 16వ తేదీన యూరియా పంపిణీ చేసేందుకు రైతులు క్యూ లైన్ లో నిల్చున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించడంతో రైతులు క్యూ లైన్ లో నిలబడి పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చి విండో సిబ్బంది నుంచి 16వ తేదీ కి సంబంధించిన యూరియా టోకెన్లను పొందారు. వర్షం పడుతున్న సైతం యూరియా కోసం రైతులు క్యూ కట్టి టోకెన్లు పొందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో  సాఫీగా టోకెన్లు తీసుకొని రైతులు వెళ్లారు.