calender_icon.png 23 August, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలి

23-08-2025 12:30:57 AM

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

భీమదేవరపల్లి ఆగస్టు 22 ( విజయ క్రాంతి) కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ సహకరించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లారం, వీర్లగడ్డ తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పోరాటం చేయడం జరిగిందో ఆ విధంగా జేఏసీగా ఏర్పడి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్రను పొందాలని అన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముస్లింల పేరుతో రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 70 ఏండ్లుగా పేద ముస్లింలు దూదేకులు బిసి రిజర్వేషన్లతోటే ఉన్నారని వారికి కొత్తగా ఇచ్చేది ఏం లేదని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిజెపి పార్టీ సపోర్ట్ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్దామని ఆయన అన్నారు.

రైతులకు సకాలంలో ఎరువులను అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వా నికి ఉందని అది విస్మరించి అర్థం లేని ఆరోపణలతో  రైతంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యను తొందరలోనే పరిష్కరించేందుకు కేంద్రం సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

గ్రామాలలో రానున్న రోజుల్లో ప్రజా సమస్యలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు గౌరవెల్లి ప్రాజెక్ట్  గుండెకాయ లాంటిదని ఇప్పటికే కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ పనులను చేపట్టి పూర్తి దశలో ఉందని ఆయన అన్నారు. కాల్వలు నిర్మాణాలు పూర్తయితే రైతులకు నీళ్లు అందించడమే కాకుండా వారి ఆర్థిక ఆదా యం పెరిగే మార్గాలు ఉంటాయని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన వెంట ఉండి నడిపిస్తున్నారని వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు. డిఆర్డిఓ మేన శ్రీనివాస్, ఆర్డీవో రమేష్ రాథోడ్, తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, కాంగ్రెస్ నాయకులు రాజు, రవీందర్, చిదురాల స్వరూప, శ్రావణ్, కిషోర్, పోలు శ్రీకాంత్ పాల్గొన్నారు.