23-08-2025 12:29:09 AM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హనుమకొండ టౌన్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో రైతులు రాజుల్లా బ్రతికారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ కు వెళ్లి యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులతో మాట్లాడారు. అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే యూరియా ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే స్థితికి వచ్చారని, ఎరువులను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలల ముందే ఎరువులు నిల్వ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణం రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.