09-10-2025 07:10:51 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ పై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఖజురహో టెంపుల్ గోడ బయట భాగం మీద తల కొట్టేయబడి ఉన్న విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మత్తులు చేపించాలని సెప్టెంబర్ 15 తేదీన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో వాదనలకు వచ్చినప్పుడు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్, ఆర్కియాలజీ కల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని అంశం ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని అట్టి కేసును కొట్టి వేయడం జరిగిందన్నారు.
అప్పటి న్యాయవాది పదేపదే నేను విష్ణుమూర్తి భక్తున్ని అని అనడం వలన న్యాయమూర్తి సిజెఐ గవాయి మరి మీరు ఒకసారి విష్ణుమూర్తికి ప్రార్థన చేయాలని అనడం దానిపై సోషల్ మీడియాలో సిజేఐపై దాడి ఎందుకు చేయకూడదని, ఇతర ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తూ గవాయికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరిగిందన్నారు. రెండు రోజుల తర్వాత సిజెఐ గవాయి వివరణ ఇవ్వడం కూడా జరిగిందన్నారు. అంత సమసి పోయిందని అందరూ అనుకున్నారు కానీ 20 రోజుల తర్వాత అక్టోబర్ 6 తేదీన రాకేష్ కిషోర్ అనే మరో న్యాయవాది కోర్టులో బూట్ విసడం జరిగిందన్నారు. ఈ 20 రోజుల కాలంలో భారత దేశంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు ఎవరు చేశారో దేశం అంత తెలుసన్నారు. నేరం జరిగినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు న్యాయవాదిపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు నల్లాల కనకరాజు, కాడే శంకర్, మద్దెల రాజేందర్, గజ్జల రవీందర్, జక్కుల బాబు, కునమల్ల చంద్రయ్య, లింగంపల్లి కుమార్, సిహెచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.