calender_icon.png 9 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

09-10-2025 07:14:39 PM

ప్రజల్లోకి వెళ్లడానికి మరింత సమయం దొరికింది..

సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

దౌల్తాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేయడం వంటి పలు అంశాలు సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువ చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూనే, ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు.