18-12-2025 01:47:18 AM
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నిజాంసాగర్ డిశంబర్ 17 (విజయ క్రాంతి): నిజాం సాగర్ మాగి మధ్యలో జరిగిన ఆటో, బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మానవత్వంతో స్పందించి వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు వివిధ మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వెళ్తుండగా, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పెద్ద కోడ్పగల్లో ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.