3 July, 2026 | 2:41 AM

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

03-07-2026 01:50 AM

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  అశోక్

మిర్యాలగూడ, జులై 2 : మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు సాగిస్తున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని  బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఫీజుల దోపిడి చాలక నోట్స్, పుస్తకాలు, డ్రెస్ లు, బూట్లను విక్రయించడం సిగ్గు చేటన్నారు. 

తమ దగ్గరే పుస్తకాలు యూనిఫామ్ తీసుకోవాలని ఒత్తిడి గురిచేస్తున్నారని, విషయాన్ని ఉన్నతధికారులకు చెప్పిన పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు,  జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు,  మునగల శైలేందర్,  పట్టణ కన్వీనర్ పట్టేటి రమేష్,  పట్టణ కార్యదర్శి ఉపేందర్, రమేష్, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.