calender_icon.png 15 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ జెండా ఎగరాలి

15-09-2025 01:49:04 AM

  1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిందే..
  2. గెలుపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పనిచేయాలి
  3. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జూబ్లీహిల్స్‌లో  కాంగ్రెస్ బావుటా ఎగురవేయాలని, ఉప ఎన్నికలో అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పలువురు మంత్రులు, పార్టీ నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అభ్యర్థి ఎంపిక అంశాన్ని ఏఐసీసీ చూసుకుంటుందని, అధిష్ఠానం ఎవరిని అ భ్యర్థిగా నిలబెట్టినా, ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను నియోజకవర్గ ప్రజలకు వివరించాలని, పోలింగ్‌కేంద్రాల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను గుర్తించి, తక్షణం వాటికి పరిష్కారం చూపాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే నియోజక అభివృద్ధి సాధ్యమవుతుం దని ప్రజలు భావించేలా పనులు చేపట్టాలన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునట్లు గానే జూబ్లీహిల్స్‌లోనూ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ  మే యర్ విజయలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల చైర్మ న్లు పాల్గొన్నారు.