12-07-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే గుర్ఖా జయపాల్ యాదవ్
తలకొండపల్లి,జులై 11:తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం న డుస్తుంది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే గుర్ఖ జయపాల్ యాదవ్ తీవరంగా విమర్శించారు.కల్వకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం మంత్రుల పర్యటన సం దర్భంగా కల్వకుర్తి,మాడ్గుల,తలకొండపల్లి,వెల్దండ మండలాల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను గురువారం అర్దరాత్రి ముందస్తుగా అరెస్ట్ చేసి తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తర లించారు.
విశయం తేలిసిన మాజీ ఎమ్మెల్యే జయపాల్ యా దవ్ నియొజవర్గం లోని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.అరెస్టై పోలీస్ స్టేషన్లో ఉన్న బిఆర్‌ఎస్ నాయకులను కలిసి పర మార్శించారు.ముందస్తు అరెస్ట్ లను జయపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రం లోని కాంగ్రేస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తు,రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని దు య్యబట్టారు.ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తుంన్నందుకు సహించలేని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేయడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు.ఎక్కడో శంకుస్తాపనలు, ప్రారంబో త్సవాలు ఉంటే ఇక్కడ అరెస్ట్ లు ఎందని ప్రశ్నించారు.ప్రభు త్వం అదికారం లోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఎక్కడి గొం గడి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రేస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఇప్పటికైన కాంగ్రేస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు,ప్రజలను ఆదుకోవాలని జయపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ యడ్మ సత్యం,మాజీ జడ్పీటీసీలు దశరత్ నాయక్,పత్యానాయక్,విజితారెఢ్ఢి,మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచులు,ప్రజా ప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.