calender_icon.png 20 May, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది

19-05-2025 08:49:32 PM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

కోదాడ: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. సోమవారం నియోజకవర్గంలో రూ.58 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కోదాడ మండలం, కూచిపూడిలో రూ.12 కోట్లతో 5.5 కిలోమీటర్ల మేర కూచిపుడి నుండి తొగర్రాయి వరకు నిర్మాణం చేయనున్న ఆర్ అండ్ బి డబుల్ రోడ్డుకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.

తొగర్రాయిలో రూ.8 కోట్లతో తొగర్రాయి నుండి శీత్లా తండా వరకు ఆర్ అండ్ బి డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు మండలం, నారాయణపురంలో రూ 20 కోట్లతో ఆర్ అండ్ బి డబుల్ రోడ్డుకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. కోదాడ ఆర్టీసీ బస్ స్టేషన్ ను సందర్శించి రూ 16.85 కోట్లతో బస్టాండ్ ఆధునీకరణకు మంజూరైన పనుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలాజీనగర్ లో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్-స్టేషన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ అలీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.