19-05-2025 08:52:21 PM
25 వసంతాలు పూర్తి చేసుకున్న భద్రాచలం వాసవి క్లబ్ అధ్యక్షులు చారు గుల్ల శ్రీనివాస్ ఘన సన్మానం..
భద్రాచలం (విజయక్రాంతి): వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న వాసవి క్లబ్స్ అధ్యక్షులను ఘనంగా సన్మానించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాసవి క్లబ్ భద్రాచలంను వరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానం స్వీకరించిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్, పూర్వపు అధ్యక్షులు ఉడత నగేష్ కుమార్, నడిపల్లి వెంకటేశ్వరరావు, రేపాకరామారావు తదితరులను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు ఇరుకుళ్ల రామకృష్ణ, గార్లపాటి శ్రీనివాసులు, శ్రీమతి సుజాత రమేశబాబు, ప్రోగ్రాం చైర్మన్ సింగిరికొండ రవీందర్ చేతుల మీదుగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది.