calender_icon.png 20 May, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన దళితరత్న గ్రహీతలు డేవిడ్ రాజు, దూపెల్లి శ్రీను

19-05-2025 08:42:47 PM

వైరా (విజయక్రాంతి): దళిత సమాజ ఉన్నతి కోసం సేవ చేసిన నాయకులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 దళిత రత్న అవార్డులను హైదరాబాదు క్లాసిక్ గార్డెన్లో సోమవారం ప్రధానం చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ తెలంగాణ చైర్మన్ ఇటుక రాజు మాదిగ అవార్డులు అందించారు. ఖమ్మం జిల్లా నుండి సామాజిక ఉద్యమ నేత ఎస్సీ ఉప కులాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ రాజుకి దళిత అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన కారేపల్లి మండలంకు చెందిన మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు దుప్పెల్లి శ్రీను మాదిగ, ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి పుక్కముడి సంపత్ దళిత రత్న అవార్డులకు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా డేవిడ్ రాజు మాట్లాడుతూ... తనకు దళిత రత్న అవార్డు రావటానికి కృషిచేసిన మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో అవార్డుకి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినందుకు మరింత బాధ్యతగా దళితుల సంక్షేమం కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. తుపెల్లి శీను మాట్లాడుతూ... మాదిగల ఉన్నతకి అభివృద్ధికి ప్రతినిత్యం పాటుపడతానని తెలిపారు.