జనగామలో బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్‌కు లేదు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, డిసెంబర్ 28 (విజయక్రాంతి):జనగామ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ పార్టీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనగామ సర్పంచుల సమావేశం, అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగి న సర్పంచ్ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలోని మెజారిటీ సర్పంచ్ స్థానాలను బీఆ ర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. అలా గే అన్ని మండలాల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బీఆర్‌ఎస్ పార్టీ నుంచే ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫోరం మాదేనని, సర్పంచ్ తమవారేనని చెప్పుకునే ప్రయత్నం చేయ డం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఎన్నికల ఫలితాలపై ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే ఇతర పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయని, కేవలం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందగా అందులో ఒకటి జనగామ అని చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే పల్లా గుర్తు చేశారు.
సర్పంచ్ ఎన్నికల వివరాలను వెల్లడిస్తూ, నర్మెట్ట మండలంలో 17 గ్రామ పంచాయతీలకు 10 బీఆర్‌ఎస్, తరిగొప్పుల మండలంలో 15 జీపీలకు 6 బీఆర్‌ఎస్, జనగామ మండలంలో 21 జీపీలకు 11 బీఆర్‌ఎస్, కొమరవెల్లి మండలంలో 11 జీపీలకు 7 బీఆర్‌ఎస్, మద్దూర్ మండలంలో 11 జీపీలకు 7 బీఆర్‌ఎస్, దులిమిట్ట మండలం లో 11 జీపీలకు 7 బీఆర్‌ఎస్ మద్దతు పొం దిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందారని తెలిపారు.
మొత్తం 73 గ్రామ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. జనగామ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సొంత గ్రామంలో కూడా సర్పంచ్ను గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ పార్టీ తన సత్తా ను చాటుతుందని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




